కాంగ్రెస్ ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి శిక్షించాలి…………..

రామ్ గోపాల్ పేట మార్చి 23 (జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లు ,ఎస్సీ వర్గీకరణ తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కోట నీలిమ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొంతమంది దుండగులు జిహెచ్ఎంసి సిబ్బంది దుస్తులు వేసుకొని అర్ధరాత్రి తొలగించడం పై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సిటీలైట్ హోటల్ చౌరస్తాకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా త్రికాల మనోజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలతో ప్రజల ఆదరణ పొందుతుండడం చూసి ఓర్వలేకనే ఇటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫ్లెక్సీలను చించివేసినంత మాత్రాన ప్రజల హృదయాలలో నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూరం చేయలేరని హెచ్చరించారు. శనివారం రాత్రి 8గంటలకు ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా రాత్రి పన్నెండు గంటల వరకు తొలగించడం జరిగిందని ఇది కచ్చితంగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల ప్రోద్బలంతోనే జరిగిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. సనత్ నగర్ లో కాంగ్రెస్ ప్రాబల్యం పెరగడాన్ని చూసి ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు. 42శాతం బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను తిరగరాసిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆదేశాలను అమలు చేస్తూ ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉంటూ వారి కష్టసుఖాల్లో ఉంటున్న కోట నీలిమకు కూడా సనత్ నగర్ ప్రజల నుండి పెరుగుతున్న ఆదరణను కూడా చూసి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని వెల్లడించారు. ఫ్లెక్సీని తొలగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఫ్లెక్సీ ని చించివేసిన వారితో పాటు సూత్రధారులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ , సనత్ నగర్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు ఖమర్ , సనత్ నగర్ నియోజకవర్గం “ఏ”బ్లాక్ అధ్యక్షురాలు నజరీన్‌, సనత్ నగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ జి.ఎల్ రమేష్ బాబు , ఏమని సింగ్ ఠాగూర్, మణికం ప్రభు , గంటా సుధీర్ , శివకుమార్, రహీం , సాదిక్ , సురేష్ , నారాయణ ముదిరాజ్ , కృష్ణ ముదిరాజ్ , రాజేశ్వరి ,అశ్విని, బుష్రా, మాధవి , తస్లీమ్ , సభ , అనీఫ్ , బబ్లు ‌, మునీర్, మరియు సనత్ నగర నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు,‌ అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *