తాళ్లూరు మండలం లో గ్రీవెన్స్ సెల్ కు అధికారుల డుమ్మా -కార్యాలయంలో వున్నా తన చాంబర్ కి పరిమితమైన తహసీల్దార్

ప్రతి సోమవారం ప్రజా విజ్ఞప్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్ సెల్ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు డుమ్మాకొడుతున్నారు.. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్ సెల్ కు హౌసింగ్ శాఖ అధికారి మాత్రమే సమావేశం ముగిసేవరకు ఉన్నారు. తహసీల్దార్ గ్రీన్ సెల్ 10.30 గంటలకు మొదలు కాగా 10 నిమిషాలు వుండి తరువాత తన చాంబర్లో లోకి వెళ్లి పోయారు. ఎంపీడీవో హనుమంతరావు తనకార్యాలయంలోనే వుండి విధులు నిర్వహించారు. దాదాపు 15శాఖలకు చెందిన అధికారులు వుండగా ఒక్కశాఖ అధికారి మాత్రమే హజరయ్యారు. జిల్లా అధికారులు మాత్రం వీడియో కాన్పరెన్సు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో వుండగా స్థానిక అధికారులు మాత్రం గ్రీవెన్సెల్ గురించి పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. గ్రీవెన్స్ సెల్ లో మండలస్థాయి అధికారులు లేక పోవటంతో ప్రజలు కూడా తమ సమస్యలను విన్నవించేందుకు జిల్లా కార్యాలయాలని వెళ్లి గ్రీవెన్సెల్ లోధరఖాస్తులు అందజేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *