పాఠశాలలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో ఉన్నటు వంటి సాన్నిహిత్యం పై ప్రత్యేకం గా గమనించుకోవాలని ఎస్పై మల్లిఖార్జున రావు అన్నారు. తాళ్లూరు ఎం ఆర్ సీ కేంద్రంలో సోమవారం ప్రధానోపాధ్యాయుల సమావేశం మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్సై మల్లిఖార్జున రావు మాట్లాడుతూ … పలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులపై వస్తున్న ఆరోపణలపై ఉపాధ్యాయులను, విద్యార్థులను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు ప్రవర్తనతో పాటు ఉపాధ్యాయులలో ఎవైనా మార్పులు ఉంటే గమనించాలని కోరారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై నమ్మకంతో పాఠశాలకు పంపుతున్నారనే విషయాన్ని నిత్యం గ మనించుకోవాలని నూచించారు. గురువు పాత్రపై మరింత అవగాహనతో ఉండాలని ఉపాధ్యాయులకు తెలిపాలని కోరారు. ఎంఈఓ -2 నుధాకర రావు తదితరులు పాల్గొన్నారు.

