తాళ్లూరు మండల కేంద్రంలో సైడు కాలువలను ఆక్రమించి ముందుకువచ్చినవ్యాపారస్తులకు గ్రామపంచాయతీఆద్వర్యంలో గ్రామ కార్యదర్శి ఐ.వి.రమణారెడ్డి సోమవారం నోటీసులు జారీ చేశారు. మండల కాంప్లెక్స్ నుండి వెల్లంపల్లి బస్టాండ్, తూర్పుగంగవరం రోడ్డు, ముండ్లమూరు రోడ్డు, రజానగరం రోడ్డు వెళ్లే మార్గంలోకొందరు వ్యాపారస్తులు సైడు కాలు వలను ఆక్రమించి రేకుల షెడ్లు వేసివ్యాపారాలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ కు
తీవ్రఇబ్బందులు పడుతున్నారు. పలువురు ప్రజలు ట్రాఫిక్ అంతరాయం గురించి గ్రామపంచాయతీ దృష్టికి తీసుక వెళ్లారు. దీంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆక్రమణదారులు స్వచ్చందంగా సైడు కాలువలపై వున్న ఆక్రమణలను వారం రోజుల్లో తొలగించాలని, లేనిఎడల గ్రామపంచాయతీ సైడు కాలువలపై వున్న ఆక్ర మణలను తొలగించటంజరుగుందని మైక్ ద్వారా తెలియ పరుస్తున్నారు. వ్యాపారస్తు లకు గ్రామపంచాయతీ సిబ్బంది నోటీసులు అంజేస్తున్నారు.
