ప్రజా ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగాలి – ప్రజల సమస్యలు పరిష్కరణే ధ్యేయంగా అధికారులు పనిచెయ్యాలి – ఎంపీపీ తాటికొండ – తాళ్లూరు మండల నర్వ సభ్య సమావేశం నిర్వహణ

అధికారులు తమ శాఖల పరంగా ప్రజలకు అవసరమ్యే పథకాలు నమచారాన్ని ముందుగా ప్రజా ప్రతినిధులకు తెలిపి ప్రజలను అప్రమత్తం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు మందిరంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ గ్రామాలలో నీటి సమస్యపై ఎంపీటీసీలు తమకు అవసరమైన బోర్లను తక్షణం మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. అధికారులు ప్రజా ప్రతినిధుల పట్ల వివక్ష చూపకుండా ముందు సమస్య గురించి సానుకూలంగా విని అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తహసీల్దార్ విఆర్లను సాయంత్రం వేళల్లో మాత్రమే కార్యాలయాలకు వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నచివాలయంలో మూమెంట్ రిజిస్టర్ ఖచ్చితంగా అమలు చెయ్యాలని కోరారు. జెడ్బీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ రెవిన్యూ వ్యవస్థ మంద కొడిగా పనిచేస్తుందని రైతులకు తగిన న్యాయం చెయ్యాలని కోరారు. వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రైతులకు పాన్ బుక్ మార్పు పనులు సైతం నక్రమంగా కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజా ప్రతినిధులకే పనులు జరగక పోతే ఇక సామాన్యుల పరిస్థితి ఎమిటిని ప్రశ్నించారు. నర్పంచిల సంఘం అధ్యక్షుడు, విఠలాపురం నర్పంచి మారం ఇంధ్ర సేనా రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పనులలో నర్పంచిల ప్రాధాన్యత లేకుండా వారికి తెలియకుండా పనులు చేస్తున్నారని, కూలీల సంఖ్య మంద కొడుగా ఉందని అన్నారు. ఇలాగే పనులు చేస్తే సర్పంచిలు ఎవరూ సహకరించరని అన్నారు. నాగంబొట్ల పాలెం నర్పంచి చిమటా సుబ్బా రావు ఉపాధి హామీ బిల్లులు సకాలంలో రావటం లేదని నభ దృష్టికి తెచ్చారు. మల్కాపురం నర్పంచి వలి మాట్లాడుతూ గత రెండెళ్ల నుండి మ్యుటేషన్ నమన్య ఒక రైతుకు ఉందని సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొర్రపాటి వారి పాలెం సర్పంచి శ్రీదేవి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ నిధులతో బోర్లు వేసి వాటిని కొందరు తమ అవసరాలకు వాడుకుంటున్నారని తగిన చర్యలు తీసుకుని ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. బొద్దికూరపాడు ఎంపీటీసీ బాల కొటయ్య మాట్లాడుతూ అనేక మంది వాగు పోరంబోకు స్థలాలు బాగు చేసుకుని పంటలు సాగు చేస్తున్నారని వాటికి రైతులకు పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ను కోరారు. తురకపాలెం సర్పంచి గురువా రెడ్డి మాట్లాడుతూ పంచాయితీ స్థలంలో నివాసం పొజిషన్ విషయంలో గ్రామ కార్యదర్శి, విఆర్లు తమ పరధి కాదంటే తమ పరధి కాదని తప్పించుకుంటున్నారని సభ దృష్టికి తెచ్చారు. దీంతో తహసీల్దార్ సంజీవ రావు మాట్లాడుతూ గ్రామ కంఠం వరకు పంచాయితీ పరధి అని, పొజిషల్ అవసరమైతే తాము అందిస్తామని చెప్పారు. ఈ తరణంలో ఎంపీడీఓ దార హనుమంత రావు పలు చట్టాలను సభదృష్టికి తెచ్చారు. అయితే ప్రజల అవసరార్థం పని చేస్తామని తెలిపారు. తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో తెల్ల రేషన్ కార్డుల ఈ -కె వైసీ చేయించాలని చెప్పారు. రీ సర్వే భూముల విషయంలో కూడ రైతులు సహకరించాలని కోరారు. ఎంపీడీఓ దార హనుమంత రావు మాట్లాడుతూ మండలంలో తాగు నీటి నమన్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లుతెలిపారు. పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి, వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి, వైద్యులు మౌనిక, ఎఈ హనుమంత రావు, వాలి, మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య, ఎపీఓ మురళి వారి శాఖల పురోగతిని వివరించారు. శాఖల వారిగా గైర్హాజరు అయిన వారికి నోటీసులు పంపి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ దార హనుంత రావును ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
మాట్లాడుతున్న ఎంపీపీ తాటికొండ
మాట్లాడుతున్న జడ్పిటిసి మారం
మాట్లాడుతున్న వైస్ ఎంపీపీ ఎడమకంటి వెంకటేశ్వర్ రెడ్డి
ప్రశ్నిస్తున్న సర్పంచ్ ఇంద్ర
ప్రశ్నిస్తున్న సర్పంచ్ వలి
పాల్గొన్న సభ్యులు ,అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *