దర్శిలో సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహంలో చేపట్టిన పనులను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్. లక్ష్మానా యక్ బుధవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును, పనులకు వినియోగిస్తున్న సామగ్రిని తనిఖీ చేసి తగు సూచనలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.13 కోట్ల వ్యయంతో వసతి గృహాల మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టామని, దర్శిలో రూ.34 లక్షలతో పనులు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సంక్షేమాధి కారిణి రబియాబేగం, వార్డెన్లు రజని, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.



