తాళ్లూరు కస్తూర్బాగాంధీ విద్యాలయంను జీసీడీవో కె.హేమలత శనివారం సందర్శించారు. కేజీబీవీలోని వంట శాలను భోజనం తయారీని పరిశీలించి నాణ్యతగల భోజనంను పిల్లలకు అందజేయాలని వంట సిబ్బందికి సూచించారు. వేసవి కాలంలో భోజనంతయారీలో జాగ్రత్తలు తీసుకుని చెడి పోని పదార్థాలనే అందించాలన్నారు. బాలికలతో భోజనం సక్రమంగా వున్నదా లేదా అడిగి తెలుసుకున్నారు. స్నానపుగదులను, మరుగుదొడ్లను పరిశీలించారు. పదవ తరగతి బాలికలతో మాట్లాడారు. ఇటీవల వ్రాసిన పరీక్ష తీరును అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదవిపరీక్షలు బాగా రాయాలన్నారు. కెజీబీవీ సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజర్ కావద్దని తెలిపారు. బాలికల పట్ల శ్రద్దతో విధులు నిర్వహించి విద్యాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈకార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ సుజిత , సిబ్బంది పాల్గొన్నారు.
