మహంకాళి మార్చి 29 (జేఎస్ డి ఎం న్యూస్)
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని మహంకాళి ఇన్స్పెక్టర్ కే. పరశురామ్ విద్యార్థులకు వివరించారు. శనివారం సికింద్రాబాద్ గ్యాస్ మండిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈవ్ టీజింగ్, ఫోక్సో చట్టం, సైబర్ నేరం, ట్రాఫిక్ నియమాలు, మరియు నిబంధనలు మాదకద్రవ్యాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇన్స్ పెక్టర్ పరశురాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్స్ పెక్టర్ పరశురాం మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులని నేటి తరం విద్యార్థులు కఠిన శ్రమతో విద్యను అభ్యసించి మంచి సమాజాన్ని నిర్మించాలన్నారు . ప్రస్తుతం సైబర్ నేరాలకు పాల్పడేవారీ సంఖ్య పెరుగుతుందని నేరగాళ్లు ఏ విధంగా ప్రజలను మోసం చేసి వారి నుంచి పైసలు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ,అలాంటి వారి పట్ల అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. అలాగే చట్టం గురించి ఇన్స్ పెక్టర్ విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కల్పన, శ్రీనివాస్ రెడ్డి , బాలాజీ ,ఎస్సై వెంకటేశ్వర్లు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

