బేగంపేట మార్చి 29(జే ఎస్ డి ఎం న్యూస్)
సికింద్రాబాద్ ఎస్పి రోడ్ శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం ఉగాది పర్వదినం సందర్భంగా సాయంత్రం గం 5.30 నిమిషములకు పంచాంగ శ్రవణం చేయనున్నట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాస శర్మ ,ప్రధాన అర్చకులు సి .బద్రీనాథ్ చార్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు అలాగే ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి సీతారామ కళ్యాణం ఉదయం గం 10. 30 నిమిషములకు ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఏప్రిల్ 12వ తేదీన శనివారం హనుమత్ విజయోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
