బేగంపేట మార్చి 30 (జె ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట విమానాశ్రయం రన్ వే కింద నుంచి 600మీటర్ల పొడవు హెచ్ ఎం డి ఏ ఎలివేటెడ్ కారిడార్ అలైన్ మెంట్ తీసుకువెళుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్ పల్లి వరకు రోడ్డు వంపులు తిరిగి (స్ట్రిప్ కర్వ్ )వున్న నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.దీంతో విమానాశ్రయం కింద సొరంగం నిర్మించడానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏ ఏ ఐ)తాజాగా అనుమతి ఇచ్చింది.దీంతో హెచ్ ఎం డి ఏ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి అయితే ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వెళ్లే వాహన దారులకు మరింత సౌకర్యంగా వుంటుంది.ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
బేగంపేట విమానాశ్రయం కింద నుంచి టన్నెల్ రోడ్డు……గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏ ఏ ఐ……..
30
Mar