తాళ్లూరులో అవతరించిన అవధూత వెంకట్రామయ్య స్వామి తిరునాళ్లకు ఆదివారంనిర్వహించేందుకు ఏర్పాట్లు చురుకుగాసాగున్నాయి. నెల్లూరు జిల్లా జమీందారీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేసిన, గ్రామ పంచాయతీ వ్యవస్థాపకులైన తాళ్లూరు గ్రామసుంకిరెడ్డి పాలెంకు చెందిన ఇడమకంటి చినకోటిరెడ్డి కుమారుడు వెంకట్రామిరెడ్డి తత్వవేత్త. ప్రజలకు కాలజ్ఞానాన్ని బోధిస్తువుండేవారు. పేదప్రజలకుతనవంతుసహయసహకారాలు అం దిస్తూ వుండేవారు. రైతులకోసం రజానగరం పంటకాలువను నిర్మింపజేసి సాగు నీటి వసతి ఏర్పాటుకు కృషి చేశారు. ప్రజలకు బ్రహ్మాంగారికాల జ్ఞానం బోధిస్తూ, వుండేవారు. తన మరణంను ముందుగా చెప్పి ఆదే రోజు మృతి చెందటంతో వెంకట్రా మిరెడ్డి అందరూ దైవసమానునిగా బావించారు. అవదూత వెంకట్రామయ్య స్వామిగా ప్రజలు ఆరాధిస్తూ ఆయన సమాధిపై శివాలయాన్ని నిర్మించి ప్రతి ఏటా ఉగాది పండుగ రోజు తిరునాళ్ల నిర్వహిస్తున్నారు. సంతానం లేని వారు ఆలయంకు వెళ్లి పూజలు చేయటం వల్ల సంతానం కలగటంతో ఈప్రాంతంలో అనేక మందికి వెంక ట్రామయ్య పేర్లు పెట్టుకోవటం ఆనవాయితీగా వుంది. ఆమార్గంలో దోర్నపువాగు దాటి వెళ్లేందుకు ఇబ్బందిగా వుండటంతో వెంకట్రామయ్య స్వామి మనువడు, పారిశ్రామిక వేత్త ఇడమకంటి వెంకట్రామిరెడ్డి చప్టా నిర్మానంతో పాటు రోడ్లు వేయించారు. ప్రతి ఏటా శివరాత్రి, ఉగాది, పలు ముఖ్య పండుగ రోజల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి. అవదూత వెంకట్రామయ్య 88వ వార్షిక వేడుకలు ఆదివారం ఉగాది పండుగ రోజున ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
