జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని తాళ్లూరు మండల వైసీపీ నాయకులు ఆదివారం కలిసి గజ మాలతో సత్కరించారు. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తాళ్లూరు మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, గుంటి గంగ దేవస్థాన మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి, పూనూరి దేవదానం, సంగు కొండా రెడ్డి, సుబ్బా రెడ్డి, జక్కుల రామక్రిష్ణ తదితరులు ఉన్నారు.
