కొర్రపాటి వారి పాలెం వైసీపీ అభిమాని గొల్లపూడి వీరయ్య ఉరఫ్ జగన్ మొక్కబడి కి వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ లు ఆదివారం హాజరైనారు. వీరయ్య దర్శి ఎమ్మెల్యేగా గెలుపొందినట్లయితే కామేపల్లి వద్ద గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటానని మొక్కకున్నాడు. ఆయన కోరిక తీరటంతో ఆయన ఆదివారం మొక్కులు చెల్లించుకుని అభిమానులకు విందు ఏర్పాటు చేసారు. పార్టీ నాయకులు శరత్, విష్ణు, ధర్మయ్య, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.



