మానవుని ముగింపులో అంతిమ యాత్ర సాఫీగా సాగుటకు ప్రతి పౌరునికి గౌరవ ప్రదమైన వీడ్కోలు పలుకుటకు పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకువచ్చేలా కృషి చెయ్యాలని రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మానవత స్వచ్చంద సేవా సంస్థ కన్వినర్ కపురం శ్రీనివాస రెడ్డి కోరారు. ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డిని, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బా రెడ్డిని వేరు వేరుగా కలిసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ ఆరోగ్య విషయం, వైవీ సుబ్బా రెడ్డి మాతృమూర్తి మృతి విషయంలో తన సానుభూతి తెలిపారు. అనంతరం ఇతర దేశాలలో అంతిమయాత్ర చట్టం ఉన్నట్లు వివరించారు. పార్లమెంట్ లో ఆ చట్టం తీసుకువచ్చే విషయం తగిన ప్రయత్నం చేస్తామని ఇరువురు హామీ ఇచ్చినట్లు కపురం తెలిపారు.

