ఆనందోత్సాహాల నడుమ విశ్వావసు నామ ఉగాది సంబరాలు -పలు రంగాల్లో పదిహేను మంది ప్రముఖులకు విశిష్ట పురస్కారాలు -ముఖ్య అతిథులుగా హాజరైన సిఐ పి.సుబ్బారావు , ఎపియుడబ్లూజే జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ -శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం లో మిన్నంటిన వేడుకలు

మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజారులో గల శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో ఆదివారం శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు రవి శర్మ ఉగాది పంచాంగ శ్రవణం వినిపించారు. అనంతరం మందిరం కార్యదర్శి గోపాలుని హరిహరరావు అధ్యక్షతన విశిష్ట సేవా పురస్కార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలు రంగాల్లో ప్రముఖులైన 15 మందికి విశిష్ట సేవా పురస్కారాలను అందజేస్తూ ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మార్కాపురం సిఐ పి. సుబ్బారావు మాట్లాడుతూ …. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో పనిచేస్తున్న వారిని గుర్తించి ఇలాంటి సత్కారాలు చేయడం వల్ల వారు మరింత ఉత్సాహంగా సమాజంలో పని చేస్తారని పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన మందిర సభ్యులకు, ఆయన అభినందనలు తెలిపారు. ఏపి యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్లూజే) జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ మాట్లాడుతూ ….సమాజాభివృద్ధి కోసం ఎవరైతే నిరంతరం కష్టపడి పనిచేస్తారో అటువంటి వారికి ఎప్పుడూ సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు. సామాజిక సేవే సాయి తత్వమని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో మానవ సంబంధాలు కనుమరుగైపోయి ఆర్థిక సంబంధాల వైపు సమాజం పరిగెడుతుందని, ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు ఇరుగుపొరుగు వారికి సహాయపడాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ అన్నారు.
వైద్య రంగం నుండి డాక్టర్ చప్పల్లి కనకదుర్గ ను, ఉద్యోగ ఉపాధ్యాయ రంగాల నుండి మార్కాపురం సిఐ సుబ్బారావు, ఆర్టీసీ అధికారి కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు రజనీ కుమార్ లకు పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. సేవారంగం నుండి ఆర్కేజె నరసింహం, బిజెపి నాయకులు పీవీ కృష్ణారావు లను సత్కరించారు. పత్రికా రంగం నుండి అగ్ని అధినేత కాళంరాజు రామకృష్ణను, కళారంగం నుంచి పురాణం సుబ్రహ్మణ్యం,చిత్తారి రంగనాయకులు, మద్దెల సుబ్బారావు లకు పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఆధ్యాత్మిక సేవా రంగాల్లో యం.నాగ మల్లికార్జున రావు,గుంటక సుబ్బారెడ్డి, నారాయణం తులసీ గార్లను విశిష్ట సేవా పురస్కారాలను అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం అధ్యక్షులు బి.శ్రీనివాస శాస్త్రి,ఆలయ కమిటీ అధ్యక్షులు పేరం సత్యనారాయణ, కోశాధికారి నాగరాజు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆలయ మహిళ సంఘం, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *