ఆదిత్య మెహతా ఫౌండేషన్ అథ్లెట్లు చారిత్రాత్మక విజయం…………….మొదటి నేషనల్ పారా రోడ్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ లో25 పతకాలు కైవసం……….

హైదరాబాద్, మార్చి 31,
(జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

హైదరాబాద్, మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన మొదటి నేషనల్ పారా రోడ్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ 2025లో ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఏఎంఎఫ్) 25 పతకాలు కైవసం చేసుకోవడం ద్వారా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయం ఆదిత్య మెహతా ఫౌండేషన్ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఆదిత్య మెహతా మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన నవోదయ విద్యాలయ సమితి (జేఎన్వీ రంగారెడ్డి) పాఠశాల పారా సైక్లిస్టులు 16 పతకాలు గెలుచుకున్నారు. వీరి అచంచలమైన అంకితభావం పారా సైక్లింగ్ లో కొత్త ప్రమాణాలు నెలకొల్పాయి. ఈ ఛాంపియన్ షిప్ లో దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 90 మంది పారా సైక్లిస్టులు పాల్గొన్నారు.
బంగారు పతకాలు సాధించిన వారిలో హర్యానాకు చెందిన ప్రీతమ్ పునియా (జూనియర్ హ్యాండ్ సైకిల్ – పురుషులు), ఆంధ్రప్రదేశ్ కు చెందిన చందన (జూనియర్ హ్యాండ్ సైకిల్ – మహిళలు), మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ అర్కల్ (సీనియర్ హ్యాండ్ సైకిల్ – పురుషులు), మధ్యప్రదేశ్ కు చెందిన హరిమంగేష్ (జూనియర్ మెన్ – సీ2), అస్సాంకు చెందిన లాల్రామ్ (జూనియర్ పురుషులు – సి3), ఉత్తరప్రదేశ్ కు చెందిన సమీర్ చౌదరి (జూనియర్ పురుషులు – సీ4), జమ్మూ & కాశ్మీర్ కు చెందిన అబిద్ హుస్సేన్ ఖాన్ (జూనియర్ పురుషులు – సీ5), గుజరాత్ కు చెందిన విశ్వ (జూనియర్ మహిళలు – సీ3), అస్సాంకు చెందిన లిసా (జూనియర్ మహిళలు – సీ5), ఆంద్రప్రదేశ్ కు చెందిన అర్షద్ షేక్ (సీనియర్ పురుషులు – సూ2), ఆంద్రప్రదేశ్ కు చెందిన పవన్ కన్నోజియా (సీనియర్ పురుషులు – సి3), మహారాష్ట్రకు చెందిన జ్యోతి గదేరియా (సీనియర్ మహిళలు సీ2), కర్ణాటకకు చెందిన బసవరాజ్ (సీనియర్ పురుషులు సీ5) ఉన్నారు. రజత పతకాలు సాధించిన వారిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆశిష్ చౌదరి (జూనియర్ హ్యాండ్ సైకిల్ – పురుషులు), మహారాష్ట్రకు చెందిన యోగేష్ అహిరే (సీనియర్ హ్యాండ్ సైకిల్ – పురుషులు), లడఖ్ కు చెందిన ఇఫ్తికార్ (జూనియర్ పురుషులు – సీ2), హిమాచల్ ప్రదేశ్ కు చెందిన త్రిభువన్ (జూనియర్ పురుషులు – సీ4), హర్యానాకు చెందిన అనన్య (జూనియర్ మహిళలు – సీ5), తెలంగాణకు చెందిన ఆర్యవర్ధన్ చీలంపల్లి (సీనియర్ పురుషులు – సీ2) ఉన్నారు. కాంస్య పతకాలు సాధించిన వారిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన జాను రావత్ (జూనియర్ హ్యాండ్ సైకిల్ – పురుషులు), కర్ణాటకకు చెందిన సంతోష్ (జూనియర్ పురుషులు – సీ2), రాజస్థాన్కు చెందిన పియూష్ కుమార్ (జూనియర్ పురుషులు – సీ3), కర్ణాటకకు చెందిన యశ్వంత్ (జూనియర్ పురుషులు – సీ4), ఛత్తీస్గఢ్ కు చెందిన యశోద (జూనియర్ మహిళలు – సీ5), బీహార్ కు చెందిన జలాలుద్దీన్ అన్సారీ (సీనియర్ పురుషులు – సీ2) ఉన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య మెహతా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదిత్య మెహతా మాట్లాడుతూ వీరంతా ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పారా సైక్లిస్ట్లు అన్నారు. గత కొన్నేళ్లుగా ప్రాథమిక స్థాయిలో నిర్వహించిన జాతీయ ప్రతిభ గుర్తింపు కార్యక్రమాల ద్వారా ఎంపికయ్యారన్నారు. ఈ అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ, పోషణ, పునరావాస సహాయం అందించామని చెప్పారు. ఈ విజయంతో అథ్లెట్లు 2025 ఆసియన్ పారా గేమ్స్, 2026 కామన్వెల్త్ గేమ్స్, 2028 పారాలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ పారా క్రీడల్లో కొత్త రికార్డులు నెలకొల్పనుందని దీమా వ్యక్తం చేశారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ లక్ష్యాన్ని నమ్మి మద్దతు ఇచ్చిన సంస్థల సహాయం లేకుండా ఈ విజయం సాధించడం అసాధ్యం అన్నారు. పారా క్రీడలను ప్రోత్సహిస్తూ పారా అథ్లెట్లను సాధికారత కలిగించడంలో మద్దతు ఇస్తున్న ఇన్వెస్కో, నవోదయ విద్యాలయ సమితి (జేఎన్వీ రంగారెడ్డి), అల్కాన్, జీఎంఎంసీఓ సంస్థలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *