ప్రకాశం జిల్లా, జిల్లా పోలీస్ శాఖలో ఐటి కోర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ( ఏ ఎస్ ఐ .1770) కె.వేణుగోపాల్ రావు (52′ సం) శనివారం ప్రమాదవశాత్తు జారిపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కె.వేణుగోపాల్ రావు భౌతికఖాయాన్ని నాగులుప్పలపాడులో ఉన్న స్వగృహం వద్ద ఉంచగా ప్రకాశం జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు పూలమాలలతో నివాళులర్పించి సంతాపం తెలియజేశారు. గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ట్రైన్ డిఎస్పీగా ప్రకాశం జిల్లాకు కేటాయించినప్పుడు ఐటీ కోర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ రావు సాంకేతికను అందిపుచ్చుకుంటూ పలు కీలకమైన కేసులలో సేదించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. వేణు తో 17 సంవత్సరాలు అనుబంధం ఉందని,ఏ ఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో విధులు నిర్వహిస్తూ తిరిగి ప్రకాశం జిల్లాకు రావటంతో ఐటి కోర్ విభాగంలో అతని సర్వీసును ఉపయోగించుకోవడానికి జిల్లా ఎస్పీ ఐటి కోర్ ఇంఛార్జిగా నియమించటం కూడా జరిగిందని, అలాంటి వ్యక్తి ఈ విధంగా మరణించటం అనేది చాలా భాదకరమైన విషయమని తన విచారాన్ని వ్యక్తపరిచారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని తెలిపారు. కె.వేణుగోపాల్ రావు కి అఖిల్, అలేఖ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కె.వేణుగోపాల్ రావు మరణించడం చాలా బాధాకరమని విషయమని తన విచారణనను వ్యక్తపరిచారు. మృతి చెందిన ఏఎస్ఐ కుటుంబాన్ని జిల్లా ఎస్పీ ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని నింపి, అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణించిన కె.వేణుగోపాల్ రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండదండలుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి పోలీసు డిపార్ట్‌మెంట్ తరుపున రావాల్సిన అన్ని పరిహారాలు, ప్రయోజనాలనూ సకాలంలో అందేవిధంగా కృషి చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. మృత దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ క్రియలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
జిల్లా ఎస్పీ వెంట ఏ ఆర్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణ రెడ్డి, నాగులుప్పలపాడు ఎస్సై శ్రీకాంత్, టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు మరియు సిబ్బంది ఉన్నారు.

