దర్శి పట్టణం లోని అద్దంకి రోడ్డులోని సీతారామ స్వామి వారి దేవస్థానము నందు ఆదివారం జరిగిన కళ్యాణ మహోత్సవంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ…….ఆనాడు రాముడు ధర్మభద్ధ పాలనకు నిలువెత్తు నిదర్శనంగా పట్టాభిషేకం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారుని … ధర్మ మార్గంలో ఆనాడు శ్రీరాముడు నడిచారని … శ్రీ రాముడు ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో శ్రీరామచంద్రమూర్తి దయతో మీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు . మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తుందని అన్నారు . ఆనాడు రాముని సుగుణాభిరాముని చరిత్రను ఈనాటి ప్రజానీకం తెలుసుకొని ప్రజల హక్కులకుప్రజల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రజాహిత పాలనే ధ్యేయంగా మన కూటమిపాలన సాగుతుందని చెప్పారు . వాడవాడలా జరిగే నవమి వేడుకలలో గ్రామాలన్నీ వెలిగిపోతున్నాయి. సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా ప్రజాస్వామ్యతంగా ప్రజలు ఆనందంగా జీవించేందుకు దేవుని దయతో మన కూటమి పాలకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర వైపు పరుగులు తీస్తుందని అన్నారు . అదే స్ఫూర్తితో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఆ శ్రీరాముని దయ మన ప్రాంతం పై ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు . ఈ దర్శి గడ్డపై అడుగిడి ఏడాది కాలం పూర్తయిందని చెప్పారు . ఈ ఏడాది కాలంలో ప్రజల అభివృద్ధి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా మన కూటమి ప్రభుత్వంలో మనం ముందుకు వెళుతున్నామని అన్నారు . దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చాలన్న సంకల్పంతో నా ప్రయత్నం సాగుతుందని తెలిపారు . నా ప్రయాణానికి అటు దేవుని దయ, ప్రజల సహకారం ఎల్లవేళలా ఉండాలని ఉంటాయని కోరుకుంటూ దర్శిని మార్గదర్శిగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట ఇచ్చారు.
ఈకార్యక్రమంలో నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, మహిళలలు మరియు టిడిపి యువ నాయకులు దారం సుబ్బారావు, చిన్నా, కర్నా శ్రీను, గోపు వెంకటేశ్వర్లు, వాసు, కోటేశ్వరరావు, సంగు ఏడుకొండలు, మధు మరియు క్లస్టర్ లు, యూనిట్ ఇంచార్జిలు, బూత్ ఇంచార్జి లు కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.



