గుంటిగంగ తిరునాళ్ల ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు -దర్శి సీఐ రామారావు

జిల్లాలో ప్రసిద్ధి గాంచిన గుంటిగంగతిరునాళ్ల ఈ 18వ తేదీ జరుగనున్నందున ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపడతామని దర్శి సీఐ రామారావు తెలిపారు. తాళ్లూరు మండంలోని గుంటిగంగ భవాని ఆలయపరిసరప్రాంతాలను, తిరునాళ్ల ప్రాంగణాన్ని సీఐ,ఎస్సైలు శుక్రవారం పరిశీలించారు. గుంటిగంగమ్మ తిరునాళ్లకు అత్యధికంగా భక్తులు వచ్చే అవకాశమున్నందున భక్తులందరు ప్రశాంత వాతావరణంలో గంగమ్మను దర్శించుకునేలా, తిరునాళ్ల జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా నిర్వహించాల్సిన ట్రాఫిక్ ఆంక్షలను, ఏఏ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా వుంటుందో గుర్తించారు. ప్రభలు ఏర్పాటు చేయుప్రాం తాలను, బ్రిడ్జి కాలువ పరిసరాల్లో గల రద్దీప్రాంతాల వద్ద తీసుకోవాల్సిన చర్యల గురించి ఎస్సై మల్లిఖార్జునరావుకు వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గుడి చుట్టూ ఎలాంటి షాపులు లేకుండా చూడాలని, భక్తులుగంగమ్మను దర్శించుకునేందుకు బారీ కేడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగుచర్యలు చేపట్టాలనిఆలయకమిటీ చైర్మన్ కొసనాగురుబ్రహ్మంకు సీఐ,ఎస్సైలు సుచించారు. ప్రభల నిర్వ హకులు కూడా సంబరాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రజలకు అసౌకర్యంక లుగకుండా చూడాలన్నారు. ప్రభల ముందు 100 మీటర్ల మేర ఖాళీ ప్రదేశం వుంచి బారీ కేడ్లు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎస్. మల్లిఖార్జు నరావు, దర్శి, ముండ్లమూరు ఎస్సైలు మురళి, కమలాకర్, ఏఎస్ఐ మోహన్ రావు, ఆలయకమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, దేవదాయశాఈవో వాసు,
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *