ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషణ పథకాలను గర్భిణిలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ సిహెచ్ భారతి కోరారు. స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో శుక్రవారం పోషన్ పక్వాడ పథకంపై అవగాహన కల్పించారు. రక్త హీనత గల వారిని గుర్తించి గర్భిణి నుండి బాలింతల వరకు అవసరమైన పోషణ అంగన్ వాడీల ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కువ పోషక విలువలు ఉన్న పదార్థాలను తీసుకోవాలని, చిరుధాన్యాలు చక్కగా ఉపయోగించుకోవాలని కోరారు. పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీమంతాలు నిర్వహించారు. ఎంపీడీఓ దార హనుమంత రావు, వైద్యుడు రాజేష్ యాదవ్, ఎపీఎం దేవ రాజ్, సూపర్ వైజర్ జ్యోతి లు పాల్గొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న పోషణ పథకాలను వినియోగించుకోవాలి – సీడీపీఓ సిహెచ్ భారతి
12
Apr