బేగంపేట ఏప్రిల్ 13
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సరైన జాగ్రత్తలు చేపట్టడం ద్వారానే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా నివారించవచ్చని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 14 నుండి 20 వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని పోస్టర్ లను ఆవిష్కరించారు. వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి, లీడ్ ఫైర్ ఆఫీసర్ రాజు, సిబ్బంది రాజశేఖర్, అర్జున్,. ప్రసాద్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

