ఘనంగా వైకుంఠ రామాలయ ప్రతిష్టా మహోత్సవం – ప్రత్యేక పూజలు చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి, వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి, ఎంపీ శ్రీ క్రిష్ణదేవరాయలు

తాళ్లూరు: మండలంలోని విఠలాపురం గ్రామంలో వైకుంఠ రామాలయపాంచాహ్నిక ప్రతిష్టా మహోత్సవం ఆదివారం భక్తి శ్రర్థలతో ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి, యంత్రమూర్తి ప్రతిష్ట, ద్వజస్తంభ శిఖ ప్రతిష్టా, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవములు నిర్వహించారు. అనంతరం నేత్ర న్మీలనము దృష్టి కుంభం, మహా కుంభాభి షేకం, ప్రధమారాధన, శాంతి కళ్యాణం, పారాయణాదులు పరిసమాప్తి, మహా నేవేద్యం, మంగళాశాసనం, శాత్తు ఉరై తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు శ్రీకామ భక్త బృందం ఆధ్వర్యంలో మహాఅన్నదానం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్లమెంటు ఇన్చార్జి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర అధికార ప్రతినిథి శ్యామల, నరసరావు పేట ఎంపీ లావు శ్రీ క్రిష్ణ దేవ రాయలు, పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి, ఎన్ ఆర్ఎ మారం అంజి రెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *