అమీర్ పేట ఏప్రిల్ 13 :
సిక్కుల గొప్ప పండుగ భైశాఖి అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం అమీర్ పేట లోని ధరం కరం రోడ్డులో గల మున్సిపల్ గ్రౌండ్ లో అమీర్ పేట గురుద్వార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భైశాఖి వేడుకలలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు. వారి సాంప్రదాయ పద్దతి లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కూతురు నర్సింహ, బలరాం, టిల్లు బాయ్, సుమిత్ సింగ్,బాసా లక్ష్మీ, రాణి కౌర్ తదితరులు ఉన్నారు.




