సిక్కుల త్యాగం వెలకట్టలేనిదికేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

హైదరాబాద్​ ఏప్రిల్ 13(జే ఎస్ డి ఎం న్యూస్) : సిక్కుల త్యాగం వెలకట్టలేనిదని ,ధర్మం, దేశం కోసం త్యాగం చేసిన సమాజంగా సిక్కుల సమాజం గుర్తింపు పొందిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. ఆదివారం బైశాఖి దినోత్సవం సందర్భంగా అమీర్​ పేట్​ లోని సిక్కు సోదరుల పవిత్ర ప్రార్థన మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనేక సంవత్సరాలుగా అమీర్​ పేట్​ లోని ఈ గురుద్వారా ప్రబంధక్​ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటుందన్నారు.
ప్రధాని మోదీ కూడా గతంలో ఈ గురుద్వారాను సందర్శించి తన భక్తిని చాటుకున్నారని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి చెప్పారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *