బేగంపేట ఏప్రిల్ 13 (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్సులో గత వారం రోజులుగా డ్రైనేజీలు పొంగి రోడ్లపై మురుగు నీరు పారుతుంది. అయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలు పొంగి రోడ్లపై పారుతుండటంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఆ మురుగునీటిలో నుంచి పోయేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత వాటర్ వర్క్స్ శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలు పొంగి మురుగు వ్యర్ధాలు రోడ్లపై పారుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయని దీంతో దోమలు అధికంగా వస్తున్నాయని స్థానిక బి ఆర్ ఎస్ యువ నాయకుడు వాహిద్ ఆరోపించాడు. సంబంధిత అధికారులు స్పందించి ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో పొంగి పొర్లు తున్న డ్రైనేజ్ ల ను శుబ్రం చేసి నీరు బయటకు రాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.


