జన్మనిచ్చిన గ్రామానికి తమ వంతు
చేయూతనిచ్చి రుణం తీర్చుకునేందుకు స్వర్గీయ సోమా పుల్లయ్య కుమా రులు ముందుకు రావటం అభినందనీయమని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గుంటిగంగ 100వ వార్షిక తిరు నాళ్ల సందర్భంగా పుల్లయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు భక్తులకు ఆరోగ్య చికిత్సలు చేయాలన్నతలంపుతో ఒంగోలు శ్రీరామ్ మల్టిసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా ఉచిత వైద్యశిబి రాన్ని ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్ గోట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ….ఆరోగ్య వంత మైన సమాజం కోసం ప్రభుత్వం కృషి చేస్తుండగా సోమా కుటుంబీకులు తమ వంతుగా ప్రజలకు వైద్య చికిత్సలు అందించేందుకు క్యాంపు ఏర్పాటుచేయటం అభినందనీయమన్నారు. 800 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటి కొండ శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్ రెడ్డి, షేక్ కాలేషా వలి, జనరల్ మెడిషన్ వైద్యనిపుణులు కొప్పోలు సౌమిత్ర పల్లవ్, నిర్వాహకులు సోమా ఆంజనేయులు, సోమా వెంకట సుబ్బారావు, సోమా శ్రీకృష్ణ మురళీప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
