ప్రభుత్వానికి కృతజ్ఞతలు – తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి

oహైదరాబాద్ ఏప్రిల్ 14 (జే ఎస్ డి ఎం న్యూస్ ) : రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం – 2025 అమలులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్క ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లకి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరుపున, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ తరుపున తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ తహాసీల్దార్స్ అసోసియేషన్ తరుపున, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో దేశంలో ఎక్కడా లేని సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను సృష్టించి, రెవెన్యూ ఉద్యోగుల పదోన్నతులకు బాటలు వేసిన ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులందరం రుణపడి ఉంటామన్నారు.భూ భారతి చట్టం – 2025 ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, , డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్,జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ,
టీజీటీఏ అధ్యక్ష కార్యదర్శులురాములు, రమేష్ పాక,
టీజీఆర్ఎస్ఏ అధ్యక్ష కార్యదర్శులు బాణాల రామ్ రెడ్డి, బిక్షం తదితరులు సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *