సికింద్రాబాద్ ఏప్రిల్ 20(జె ఎస్ డి ఎం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆదివారం రోజున ఉదయం10గంటలకు నామాలాగుండు లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తెదేపా సీతాఫల్ మండి డివిజన్ అధ్యక్షుడు జి వి క్రిష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలలో తెదేపా సికింద్రాబాద్ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం
సీతాఫలమండిలోని అమన్ వేదిక, రెయిన్బో అనాధ పిల్లల ఆశ్రయంలో 100 మంది పిల్లలతో కేక్ కట్ చేసి పిల్లలందరికీ పంచిపెట్టారు. ప్రత్యేక భోజనాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిటాల విజయ్ కుమార్, గరిగే ప్రవీణ్, చిరంజీవిరాజు, సుదర్శన్ రెడ్డి, పిట్ల శంకర్ ముదిరాజ్, చందర్ ముదిరాజ్, వెంకటస్వామి, నాయుడు, టెంట్ హౌస్ శంకర్, నరేంద్ర, చంద్రమోహన్, పుప్పాల విజయ్ కుమార్, రాహుల్, సీనియర్ నాయకురాళ్లు శేషిరేఖ, సరస్వతి, సాయి తదితరులు పాల్గొన్నారు.
