జేఈఈ మెయిన్స్ లోమెరిసిన ప్రకాశం జిల్లా విద్యార్థులు

జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో మెరిశారు. ఒంగోలు నగరానికి చెందిన రఘునాథ్ మకానీ జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు, కాపా షణ్ముఖ సాయిరెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ క్యాటగిరీలో 52 వ ర్యాంకు, ఈడబ్యూఎస్ కోటాలో ఆల్ ఇండియాలో 2వ ర్యాంకు సాధించారు. దర్శికి చెందిన ఎస్.వెంకటసాయిచక్రి ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరీలో 646 వ ర్యాంకు, ఈడబ్యూఎస్ కోటాలో 48వ ర్యాంకు సాధించాడు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఒంగోలుకు చెందిన కాపా షణ్ముఖ సాయిరెడ్డి, దర్శికి చెందిన ఎస్.వెంకట సాయిచక్రి తమ సంస్థల్లో చదివి ఉత్తమ ఫలితాలు సాధించారని భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్చార్జ్ శ్రీ కృష్ణ గణేష్ తెలి పారు. అలాగే ఒంగోలు శివాజీ నగర్ ఎం. సాకిత్ రామ్ కమల్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 409 వ ర్యాంకు సాధించాడన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఆయా బ్రాంచ్ ల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులను వారిని అభినందించారు.

శ్రీ సరస్వతి విద్యా సంస్థలు విద్యార్థులు జేఈఈ మెయిన్స్ (సెషన్స్-2) ఫలితాల్లో సత్తా చాటారు. శ్రీసరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు ఎన్. ఇంద్రసేనా రెడ్డి 99.21 టాప్ పర్సంటైల్, కె.లోక్ క్రిటి 98.82, కె.గుణశేఖరరెడ్డి 98.71 టాప్ పర్సంటైల్ సాధించారు. అలాగే జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియాలో క్యాటగిరీ కింద ఎం. రఘునాథ్ మకాని 29వ ర్యాంకు, కె.లోక్ క్రిటి 453 వ ర్యాంకు, వి.మణి కంఠబాబు 1329 వ ర్యాంకు, ఎన్.ఇంద్రసేనారెడ్డి 1563వ ర్యాంకు, బి. రిత్విక్ 1632వ ర్యాంకు, జి.ఎనూష్రయ్ 1870వ ర్యాంకు, కె.గుణశేఖరరెడ్డి 2698 వ ర్యాంకు సాధించారు. జేఈఈ మెయిన్స్ (సెషన్స్-1, పేపరు-2) 2025లో ఇండియా ప్రథమ స్థానంలో టాప్ పర్సంటైల్ సాధించిన కె.లోక్టి 99.94 ఆల్ ఇండియాలో ఉత్తమ ఫలితాలు సాధిం చిందని శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఎ.వి.రమ ణారెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 90 శాతం పైన సాధించిన విద్యార్థులు 20 మంది, 80 శాతం పైన సాధించిన విద్యార్థులు 54 మంది, 70 శాతం పైన సాధించిన విద్యార్థులు 130 మంది, ఆల్ ఇండియా క్యాటగిరీలో 3 వేలలోపు ర్యాంకులు సాధిం చిన విద్యార్థులు ఏడుగురు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, డైరెక్టర్లు, అధ్యాపకులు, అధ్యాపకే తర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు ఎ.గణేష్ రెడ్డి, ఎ.గంగా శంకరరెడ్డి, సీఈఓ ఎన్.వి. సురేష్, డీన్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *