ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశా లల్లో బోధన ఉంటుందని, పిల్లలకు పాఠ్య, రాత పుస్తకాలు, సంచులు, రెండు జతల యూనిఫాంతోపాటు బూట్లు, సాక్సులను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఉపాధ్యాయులు వివరించారు. తప్పకుండా బడిఈడు కలిగిన పిల్ల లందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని శనివారం మండలంలోని వెలుగు వారిపాలెంలో విస్తృత ప్రచారం నిర్వహిం చారు. స్థానిక ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు కె.శ్రీనివాసరావు, పి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యా యులు, విద్యార్థులు కలసి గ్రామంలోని ప్రతి వీధికి వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులకు కలిసి పాఠశాల, విద్య ప్రాముఖ్యత వివరించారు.

