తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామానికి చెందిన నాగంబొట్లపాలెం సొసైటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు యలమందా రెడ్డి సతీమణి సుబ్బారత్నం (45) కొంతకాలం గా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలువురు ఆమె మృతి పట్ల సానుభూతి ప్రకటించి , నివాళులర్పించారు
