ఒంగోలులోని పద్మ టవర్స్ దగ్గర మంగళవారం రాత్రి హత్య జరిగిన నేర స్థలమునకు జిల్లా ఎస్పీ స్వయంగా వెళ్లి, నేర స్థలమును క్షుణ్ణంగా పరిశీలించి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీ చేసి, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడినారు. ముప్పవరపు వీరయ్య చౌదరి ని తన ఆఫీసులో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినారు. ఈ హత్య ఎలా జరిగింది, తదితర వివరాలపై ఆరా తీశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లచే ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. ఘటనా స్థలంలోని ఉన్న అన్ని ఆధారాలను జాగ్రత్తగా సేకరించి భద్రపరచాలన్నారు. తీవ్రమైన కేసుల్లో గుర్తుంచుకోవలసిన విషయాలు, దర్యాప్తు అవసరమైన పలు సలహాలు,సూచనలు అధికారులకు ఎస్పీ తెలియచేసినారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హత్య జరిగిన వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపామని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించటం, ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టామని, దర్యాప్తు ప్రగతిపై ఎప్పడికప్పుడు సమీక్షించటం, ఈ కేసును వీలైనంత త్వరగా చేయించడమే లక్ష్యమని తెలియజేశారు.
జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు మరియు తదితరులు పాల్గొన్నారు.




