ఒంగోలులోని పద్మ టవర్స్ దగ్గర మంగళవారం రాత్రి సుమారు 07.35 గంటలకు హత్య జరిగిన నేర స్థలమునకు గౌరవ ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి.అనిత స్వయంగా వెళ్లి, నేర స్థలమును క్షుణ్ణంగా పరిశీలించారు. పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర హోమంత్రి మాట్లాడుతూ…. టీడీపీ మాజీ ఎం.పి. పి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని అతి దారుణంగా కిరాతకంగా చంపటం చాలా దురదృష్టకరమైన బాధాకరమైన విషయమన్నారు. మంచి పేరు ఉన్న వ్యక్తి అని ఎటువంటి కారణాలతో చంపడం జరిగిందో కాని, సంఘటన జరిగిన ప్రదేశానికి జిల్లా ఎస్పీ వెనువెంటనే చేరుకున్నారని, 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటం ప్రతి బృందానికి ఒక డిఎస్పీ స్ధాయి అధికారులను నియమించటం జరిగిందని, అన్ని కోణాల్లో దర్యాప్తు, సాంకేతికతను ఉపయోగించి ముద్దాయిలను పట్టుకుని చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా చేస్తామన్నారు. వీరయ్య చౌదరి మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర హోమంత్రి గారి వెంట ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ , మ్యారిటైంబోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, ఒంగోలు డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు మరియు తదితరులు ఉన్నారు.







