కంటోన్మెంట్ మే 1 (జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు టు రసూల్‌పురా లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టినా, హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా పంపిణీ కార్యక్రమం ఆలస్యం అయిందన్నారు.పేదల సంక్షేమమే రాష్ట్ర సర్కారు ప్రాధాన్యత అని, అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు. సన్నబియ్యం పంపిణీ పై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్దికంగా భారమవు తుందని సన్నబియ్యం పంపిణీ చేయలేమని దొడ్డు బియ్యం పంపిణీ చేసిందని ఆ బియ్యం తినలేక, సన్న బియ్యం కొనలేక పేదలు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే అన్నారు. పైగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మిల్లర్లు, దళారులు కుమ్మక్కు అయి దొడ్డు బియ్యం రీసౌక్లింగ్ దందా చేసి కోట్లు సంపాదించుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు బియ్యం క్వాలిటీ బాలేదని పసలేని ఆరోపణలు చేస్తున్నారని ప్రజలను అడిగితే నాణ్యత తెలుస్తుందని, బియ్యం తీసుకున్న ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇక బిజెపి నాయకులు సన్నబియ్యం పంపిణీ క్రెడిట్ తమదే అని అంటున్నారని అలా అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దేశ వ్యాప్తంగా ఎందుకు సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తుందని, గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే అర్హులందరికి రేషన్ కార్డులు కూడా అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీగణేష్ ధన్యవాదాలు తెలిపారు.
