బేగంపేట మే 3 (జే ఎస్ డి ఎం న్యూస్) :
అమీర్ పేట డివిజన్ ఎస్సార్ నగర్ లో ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఆలయ 30 వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆలయంలో నిర్వహించిన పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొడ్డు కుమార్, ఈ ఓ నరేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, గుడిగె శ్రీనివాస్ యాదవ్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

