కిషోర వికాసం పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఎ తమీమ్అన్సారియా శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బి హేన సుజన, జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్, జిల్లా బాలల సంరక్షన అధికారి పి దినేష్ కుమార్, డీఎంహెచి కిరణ్ కుమార్, ఎస్ ఎ ఆర్ డి ఎస్ బాధ్యులు సునీల్ కుమార్లు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. కిషోర వికాసం కార్యక్రమ లక్ష్యాలను చేరుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ కోరారు.

