అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభ సభలో
పాల్గొనేందుకు ఒంగోలు నియోజక వర్గం నుండి అధిక సంఖ్యలో బస్సులు, వాహనాలలో బయలు దేరి వెళ్లారు. మినిస్టేడియం నుండి వెళ్తున్న బస్సులకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన రావు, బి ఎన్ విజయకుమార్ లు జెండా ఊపి బస్సులను పంపారు. వారికి కావలసిన అల్పాహార ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, ఒంగోలు ఆర్ డిఓ లక్ష్మి ప్రసన్నలు పర్యవేక్షించారు.
సభ ప్రాంగణం వద్ద సందడి …
సభా ప్రాంగణం వద్ద మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు కలయ తిరిగారు. అభిమానులకు అభివాదాలు చెప్పారు. జాతీయ జెండాలు చేత పట్టి అభిమానులను ఉత్సాహ పరిచారు.



