సికింద్రాబాద్ మే 3 (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని కార్యకర్తలే పార్టీకి పునాదులని సికింద్రాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వల్లారపు శ్రీనివాస్ అన్నారు.
తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా ఇటీవల పూర్తిచేసిన తెదేపా సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ డివిజన్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం
తెదేపా సీనియర్ నాయకుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో అంబానగర్లోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యతిధిగా హాజరైన సికింద్రాబాద్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల తెలుగుదేశం పార్టీలో సభ్యత్వంతీసుకున్నవారందరికీ సభ్యత్వ కార్డులుఅందజేసారు.
ఈ సందర్భంగా వల్లారపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగలవల్లే పార్టీ తెలంగాణ లో అధికారంలో లేకపోయినా అత్యధిక కార్యకర్తలున్న పార్టీగా మన్ననలు పొందుతోందాన్నారు.
ఈ కార్యక్రమంలో బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు గరిగే ప్రవీణ్, సీనియర్ నాయకులు శంకర్ ముదిరాజ్, శ్రీశైలం, చంద్రమోహన్, రవి, రమేష్, యాదగిరితోపాటు సభ్యత్వం తీసుకున్నవారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
