ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థుల కొరకు మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని శనివారం కలెక్టర్
ఎ. తమీం అన్సారియా,
గవర్నమెంట్ ఐటీఐ (బాయ్స్), ఒంగోలు ప్రాంగణంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ…. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ లభిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగ శ్రీను, ఐటీఐ (బాయ్స్ & గర్ల్స్) ఒంగోలు ప్రిన్సిపాళ్లు, ఏపీఎస్ఎస్‌డీసీ ఎడీఎస్‌డీఈ ఎం. శ్రీను, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎస్‌కె ఈష్ బాషా, ఏపీఎస్ఎస్‌డీసీ,ఈ శ్రీనివాస చారి , హెచ్ ఆర్ ఎం ఐ ఎస్ ఏపీ ఎస్ ఎస్ డి సి సిబ్బంది, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
కార్యక్రమం విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

