ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత …సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్…….

బేగంపేట మే 7 (జేఎస్డిఎం న్యూస్) :
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవిమాత అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వాసవిమాత జయంతి సందర్భంగా బుధవారం రాంగోపాల్ పేట డివిజన్ లోని ఆవులమంద లో గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలేందర్, సెక్రెటరీ తమ్మి వెంకటేష్, మనుసాని శరత్ బాబు, సోమా ఆనంద్ కుమార్, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, చంద్ర ప్రకాష్, రాజు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *