పాక్ లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి – పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ తో విరుచుకుపడిన భారత్ సైన్యం -12 ఉగ్రవాదులు మంది హతం

పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ నిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావ రాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో 12 మంది ఉగ్రవాదులు మృతి చెండగా 55 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీ ర్లోని కోట్లి ముజఫరాబాద్, పంజాబ్లోని బహవల్పూర్ తో పాటు లాహోర్ లోని ఒక ప్రవేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగం నుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్లాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరు తుడిచేసిన కారణం గానే ఆపరేషన్ కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మనూవ్ అజర్, హఫీజ్ నయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *