సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల అక్రమ సోదాలపై ప్రకాశం జిల్లా మార్కాపురంలో పాత్రికేయుల నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా నిర్వహించారు.
జర్నలిస్టులపై అక్రమ కేసులను ఖండించండి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినదిస్తూ సబ్ కలెక్టర్ సాధిత్ వెంకట్ త్రివినాగ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి మార్కాపురం ఇంఛార్జి జిఎల్ నరసింహారావు, ప్రజాశక్తి శ్రీనివాస రెడ్డి, వార్త జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మూల అల్లూరెడ్డి, జర్నలిస్టులు అన్ను, శేఖర్, ఖలీల్, నరేంద్ర, సురేష్, కరీం, సుదర్శన్, షౌకత్, అబ్దుల్ రజాక్, శ్రీకాంత్, వెంకయ్య, సాక్షి విలేకరులు మల్లికార్జున్, యోగి, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.

