హైదరాబాద్ మే 8(జే ఎస్ డి ఎం న్యూస్) : పోలీసు అంటే ఇలా ఉండాలి అని నిరూపించుకున్నారు. బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.నరసింహరాజు. ప్రజల చేత అనేక మన్ననలు పొంది శభాష్ అనిపించుకుని ,ఉత్తమ పోలీసు అధికారిగా బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.నరసింహ రాజు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే 10 మంది అత్యుత్తమ పోలీసు అధికారుల్లో బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.నరసింహ రాజు ఒకరు. అయితే సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాత్రం బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.నరసింహ రాజు మొదటి స్థానంలో నిలిచారు. మూడు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ల పనితీరుకు సంబంధించి రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు ప్రజల నుండి క్యూ ఆర్ కోడ్, ప్రజల ఫీడ్ బ్యాక్ లను ఆయా పోలీసు స్టేషన్ ల పరిధిలో బోర్డులు ఏర్పాటు చేశారు. సంబంధిత పోలీసు స్టేషన్ అధికారుల గురించి వచ్చిన పనితీరును, ఫీడ్ బ్యాక్ లను పోలీసు ఉన్నతాధికారులు ఇటీవలే పరిశీలించారు. గత ఎనిమిది నెలల కాలంలో మూడు కమిషనరేట్ పరిధిలో బాలానగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ టి.నరసింహ రాజు ప్రజలకు ఉత్తమ సేవలు అందించి వారి మన్ననలు పొందడంలో మొట్టమొదటి స్థానంలో నిలిచినట్లు తెలంగాణ డైరెక్టర్ జనరల్
ఆఫ్ పోలీస్ కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 17 న డి జి పి నుంచి అవార్డ్ స్వీకరించ నున్నారు. ఈ నేపద్యంలో పలువురు బంధువులు , మిత్రులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
