దర్శి దివంగత ఎమ్మెల్యే అన్నదాత ప్రజలు ఆశాజ్యోతి సుబ్బారెడ్డి ఆరో వర్ధంతి ఘనంగా నిర్వహించారు . ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. బూచేపల్లి కళ్యాణమండపం దగ్గర ఏర్పాటుచేసిన బూచేపల్లి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, డాక్టర్ బి. జవహర్ హాజరైనారు. డాక్టర్ బి.జవహర్ మాట్లాడుతూ.. ……….. బూచేపల్లి సుబ్బారెడ్డి పేద ప్రజలకు తన వంతు సహాయం చేసే వారని ఎప్పటినుంచో కూడా వారు ప్రజలకు సహాయం చేయటమే గాని, వారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల నుంచి డబ్బులు ఆశించే వారు కాదని, అన్నదానం అనగానే తనే ముందుంటారని అన్నారు. అదే గుణాల లను పునికి పుచ్చుకున్న డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ఎమ్మెల్యేగా ఉన్నారని అన్నారు. ప్రజల మనిషి అని భావించే జిల్లాకు వైయస్సార్ పార్టీ అధ్యక్షులుగా చేసుంటారని అన్నారు. తదనంతరం పేద ప్రజలకు దుస్తులు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా , దర్శి నియోజకవర్గంలో నుంచి వచ్చిన కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు పాల్గొని బూచేపల్లి సుబ్బారెడ్డి కి ఘన నివాళులర్పించారు.





