దర్శి పట్టణంలో మానవతా స్వచ్చంత సేవా సంస్థ ఆధ్వర్యంలో మాతృదినోత్సవంను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దర్శి అర్చన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మానవతా స్వచ్చంత సేవా సంస్థ దర్శి కన్వినర్ కపురం శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మానవతా సంస్థ ఆరోగ్య విభాగం సలహాదారు సుశీలమ్మ అధ్యక్షతన నిర్వహించారు. మానవతా సంస్థ ప్రతినిథులు దేవతి ప్రసాద్, కపురం శ్రీనివాస రెడ్డిలు మాతృదినోత్సవం ప్రాముఖ్యతను + జగతిలో మాతృమూర్తి ప్రేమ గురించి వివరించారు. పలువురు మాతృమూర్తులను ఘనంగా సన్మానించారు.

