దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మేడం నివాసం వద్దకూటమి శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అభిమానుల మధ్యలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ జన్మదిన వేడుకలలో టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు ఉన్నారు.
ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ
నాపై అభిమానంతో తరలివచ్చిన నా కుటుంబ సభ్యులారా, పెద్దలారా, టిడిపి నాయకులారా, కార్యకర్తలారా, అభిమానులారా మీ అభిమానాన్ని నేనెప్పటికీ మర్చిపోను. తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ పాదాభి వందనం చేస్తున్నాను అని అన్నారు. నేను ఈరోజు నా బర్తడే జరుపుకోవడానికి రాలేదు, బర్తడే కేక్ కటింగ్ కూడా చేయడం నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు. అయితే నేనొక విషయం చెప్పడానికి మాత్రం మీ ముందుకు వచ్చాను. నా ప్రయాణం దర్శి ప్రజానికంతో ఏడాది పూర్తయింది, ఏడాదిలో మనం ఏం చేశాం, నన్ను మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యురాలుగా చూస్తున్నారని చెప్పడానికి వచ్చాను. నన్ను ఎన్నికలకు ముందు స్థానికేతురాలు అని ప్రచారం చేశారు, స్థానికులం మేమని మిమ్మలను భ్రమల్లో పెట్టి కుల మతాలు రెచ్చగొట్టి సాంకేతికంగా స్వల్ప తేడాతో గెలుపు చూయించుకున్నారు. అయితే కొన్ని గ్రామాలలో కులాలు రెచ్చగొట్టి నన్ను ఎన్నికల బూత్ ల వద్ద నన్ను అడ్డుకున్నారు. ఇప్పుడు అదే గ్రామాలలో ప్రజలు చెబుతున్నారు మేము తప్పు చేశాం, మేము ఓడిపోయాం, మిమ్మల్ని ఓడించాం, అభివృద్ధిని అడ్డుకున్నాం అని. మిమ్మల్ని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడం అన్న విషయం మాకు ఈ ఏడాది ప్రయాణంలో అర్థమవుతుంది అని కొందరు ప్రజలు పశ్చాత్తాపం చూస్తున్నాను. ఇక్కడ గెలిచామని చెప్పుకునే వైసిపి నాయకులు కనీసం అసెంబ్లీకి వెళ్ళరు, వారికి ప్రజల సమస్యలు పట్టదు. ప్రజల కోసం, దర్శి అభివృద్ధి కోసం ఏమాత్రం పట్టించుకునేది లేదు ఇప్పటికి వారిది అదే ధోరణి, కులాల మధ్య చిచ్చుపెట్టడం, వర్గాలను రెచ్చగొట్టడం, ఎక్కడ వివాదాలు ఉంటే అక్కడికి వెళ్లి రాజకీయ చిచ్చు పెట్టడం తప్ప అభివృద్ధి వైపు వారి చూపే లేదు. మనం అభివృద్ధి కోసం పడుతున్న తపన చూసి ఓర్వలేక పోతున్నారు. నేను అదే చెప్తున్నాను, నేను ఓడిపోలేదు నాకు ఓటు వేయని ప్రజలే ఓడిపోయారు. దరిశి అభివృద్ధిలో కొంచెం వెనక పడడానికి నా ఓటమి కారణమైంది. సాంకేతికంగా ఓడినా ప్రజల హృదయాలలో గెలిచాను. కొందరు కుట్రలు చేశారు, దాడులకు తెగపడ్డారు. అందుకే సాంకేతికంగా నేను ఓడిపోయాను. ప్రజలకు అర్థమైంది రాష్ట్రమంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ప్రజలకు చేస్తున్న మేలు చూస్తున్నారు. రాష్ట్రంలో ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాలలో విజయం సాధించి ప్రజా ప్రభుత్వంగా విరాజిల్లుతుంది. ఈ కూటమి సునామీలో చైతన్యవంతమైన దరిశి ఓటర్లు తప్పటడుగు వేయడం, అందరి కుట్రల్లో బలి కావడం చాలా బాధాకరం. అయినా నేను వెనకడుగు వేయను, నేను దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తా. ఈ ఏడాది నా ప్రయాణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్ళగలుగుతున్నాను. మీరు చూస్తున్నారు వారంలో ఐదు రోజులు దరిశిలో ప్రజలతో ఉంటున్నాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాను. దర్శి ప్రజలే ప్రాణంగా పనిచేస్తున్నాను. నా ప్రాణం నా ప్రయాణం దర్శి ప్రాంత ప్రజల తోనే. నిరంతరం అధికారులతో, ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం ద్వారా దర్శిని ఎలా అభివృద్ధి చేయాలని పరితపిస్తున్నాను. ఈ 11 నెలల కూటమి పాలనలో దర్శిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి అడుగులు ముందుకు వేయగలుగుతున్నాము. ప్రజల విరాళాలతో వైసిపి నిర్లక్ష్యానికి నిదర్శనం గా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాన్ని పనులు ప్రారంభించుకున్నాం. త్వరలో అన్నా క్యాంటీన్ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇందుకు 60 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. 15 కోట్లతో గ్రామాలలో రోడ్లు, డ్రైయిన్ లు వంటి అభివృద్ధి పనులు చేపట్టాం. ఐదు కోట్లతో ప్రధాన రహదారి నిర్మాణాలు మరమ్మత్తులు చేపట్టాం. రూ . 6.30 కోట్ల రూపాయలతో గురుకుల పాఠశాల భవనాలు నిర్మించుకుంటున్నాం. ఇప్పటికే లోకేష్ గారిని కోరడం జరిగింది, డిగ్రీ కళాశాల భవనాలకు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, త్వరలో ఆ నిధులు కూడా మంజూరు అవుతున్నాయి. ఉచిత మెగా మెడికల్ క్యాంపు, కంటి వైద్య శిబిరాలు, జాబ్ మేళాలు, ఇలా ప్రజలకు మంచి చేయాలన్న తలంపుతో అటు సంక్షేమం ఇటు అభివృద్ధితోపాటు సేవా కార్యక్రమాలకు ముందుండి పనిచేస్తున్నాం. అదేవిధంగా దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ తిరిగి మన ప్రభుత్వంలో ముందుకు తీసుకువెళ్లబోతున్నాం. దర్శిలో ఉన్న మినీ స్టేడియం నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం, నగరపాలక పంచాయతీకి శాశ్వత భవన నిర్మాణం, రోడ్ లు, డ్రైయిన్ లు వంటి పలు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం. దొనకొండ ప్రాంతాన్ని కరువులేని ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తున్నాను. దొనకొండ విమానాశ్రయ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా మార్చి ఉపాధి అవకాశాలకు కృషి చేస్తున్నాను. ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది. ఆయన కూడా అందుకు సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల లో వసతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాను. అంతేకాక దొనకొండలో సోలార్ పార్కుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక మంచి పరిణామంగా చెప్తున్నాను. మా బాబాయి గౌరవనీయులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా నాకు అండగా గౌరవ మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి, గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇలా అనేకమంది పెద్దలు నా వెంట ఉండి నడిపిస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, నాది అభివృద్ధి మంత్రం నేను దర్శిని అభివృద్ధి ప్రాంతంగా మార్చడమే నా లక్ష్యం. కుల మతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా రాబోయే 25 ఏళ్ళు దర్శి ప్రజలతో ఉంటాను. అభివృద్ధి చేసి చూపిస్తానని మరొక్కసారి ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశంలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. పాకిస్తాన్ కవ్విస్తుంది ఈ సమయంలో మనం భారతదేశానికి అండగా నిలబడాలి ప్రతి ఒక్కరూ గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ తీసుకునే చర్యలను మనం గౌరవించి ముందుకు వెళ్లాలి. దేశం కోసం మనమందరం అని భారత్ మాతాకీ జై అంటూ నినదించాలి. వందేమాతరం అంటూ ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి. కేంద్ర పీఎం నిధికి చేతనైన వరకు మనం కూడా ఈ యుద్ధ సమయంలో వితరణ ఇస్తే బాగుంటుంది. నా వంతుగా నేను
ఒక లక్ష రూపాయలు పీఎం సహాయనిధికి పంపేందుకు సిద్ధమయ్యాను. మీరు కూడా మీరు స్వచ్ఛందంగా పీఎం సహాయనిధికి పంపండి. దేశాన్ని రక్షించుకుందాం ఉగ్రవాదులను తరిమికొడదాం. అందరం ఐక్యంగా ఉందాం, దేశమంతా ఒకటేనని చాటి చెబుదాం. కులమతాలు వద్దు దర్శిని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకుందాం.
ఈ కార్యక్రమం దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారాపుశెట్టి పిచ్చయ్య, లో నియోజకవర్గం లోని మండల టిడిపి పార్టీ అధ్యక్షులు దొనకొండ, కురిచేడు, ముడ్లమూరు, తాళ్లూరు, దర్శి పట్టణ అధ్యక్షులు, నాగులపాటి శివకోటేశ్వరరావు, పిడతల నేమిలయ్య, కూరపాటి శ్రీను, బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, వాసు, చిన్నా బీజేపి నాయకులు మండపాకుల శ్రీను, తిండి నారాయణ రెడ్డి, జనసేన నాయకులు పుప్పాల పాపారావు, మాదాసు వెంకట శేషయ్య, కూటా ల ప్రసాద్, తోట రామారావు, వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, మరియు టిడిపి, జనసేన, బీజేపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




