రక్తదానం ప్రాణదానం తో సమానం, వేసవిలో రక్తం కొరత ఎంతో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని భారతీయ జనతా పార్టీ మీడియా కన్వీనర్ ధనిశెట్టి రాము నాయుడు విజ్ఞప్తి చేశారు. ఏ ప్రభుత్వ, ప్రైవేటు బ్లడ్ బ్యాంకులలో చూసినా అవసరమైనంత రక్తం నిల్వలు ఉండటం లేదని, దాంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి బంధువులు రక్త దాతలు కోసం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు గమనిస్తూ ఉన్నామని కనుక యుక్త వయసు వచ్చినప్పటి నుండి ప్రతి మూడు నెలలకు రక్తదానం చేయవచ్చని, రక్తదానం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగవని, లేదు, ఇవ్వలేను అనే పరిస్థితి ఎక్కడ ఉండదని, కనీసం 60 కేజీల బరువు ఉన్నవాళ్లు రక్తదానం చేయడానికి పూర్తి అర్హులని, వైరల్ ఫీవర్, వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు ఒక మూడు నెలలు ఆగిన తర్వాత నుంచి రక్తదానం చేయవచ్చని, ప్రమాదాలు జరిగినప్పుడు గుండె జబ్బులు గల వారికి తలసేమియా, లుకేమియా లాంటి క్యాన్సర్ లో ఉన్నవారికి, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలకు, ఇలా ఎందరో ప్రతిరోజూ రక్తం కోసం దాతలకు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
సోమవారం ఉదయం స్థానిక కార్పొరేట్ హాస్పిటల్లో గర్భాశయ ఇబ్బందులతో ఉన్న మహిళకు ఆపరేషన్ నిమిత్తం రక్తం అవసరమై తనను సంప్రదించగా వెంటనే రక్తాన్ని ఇవ్వడం జరిగిందని. ఆ పేషెంట్ బంధువులు చాలా సంతోషించారని తెలిపారు. ఇలా రక్తదానం 14 సారి ఇవ్వడం జరిగిందని, ఒకరి జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి ఆరోగ్యాన్ని పెంచడానికి ప్రతి ఒక్కరు కచ్చితంగా రక్తదానం చేసి సాటివారికి ఉపయోగపడాలని కోరారు.

