హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్, విన్నాం.కానీ మజిల్ స్ట్రాక్ గురించి తెలుసా.. ఎల్బీనగర్లోనే నాసా హాస్పిటల్ లో మొట్టమొదటిసారిగా మజిల్ స్ట్రాక్ (లింబ్ ఇస్కెమియా) కు చికిత్స.ఒకే వ్యక్తికి 9 శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేసి యువకుడి ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ల బృందం.

హైదరాబాద్ మే 12(జే ఎస్ డి ఎం ప్రధాన ప్రతినిధి) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వైద్యరంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఎల్బీనగర్ లోని నాసా హాస్పిటల్ వైద్యుల బృందం యువకుడికి అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ల గురించి మనకు తెలుసు.కానీ మజిల్ స్ట్రోక్ కూడా ఉంటుందని మజిల్ స్ట్రోక్ (లింబ్ ఇస్కెమియా) వచ్చిన వెంటనే సరైన సమయంలో నిపుణుల పర్యవేక్షణలో సరైన చికిత్స ఇస్తే పూర్తిగా కోలుకోవచ్చని నాసా హాస్పిటల్ వైద్యులు చేసి చూపించారు.సోమవారం ఎల్బీనగర్ లోని నాసా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ అరుదైన శస్త్ర చికిత్స వివరాలను వెల్లడించారు. నాసా హాస్పిటల్ న్యూరాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ వేణిగళ్ళ, క్రిటికల్ కేర్, అనస్తీసియా విభాగాధిపతి డాక్టర్ రాకేష్ లు మాట్లాడుతూ హయత్ నగర్ కు చెందిన తిరుపతి 30 సంవత్సరాల వ్యక్తి ఫిజియోతెరపిస్టుగా పనిచేస్తున్నాడు. ఇతనికి గత కొద్ది రోజులుగా కుడికాలు పాదం వీక్ కావడంతో పాటు నడుం నొప్పి రావడంతో డిస్క్ సమస్య అనుకొని ఎం ఆర్ ఐ స్కాన్ చేసి చూసిన సమస్య తెలియక పోవడంతో గత నెల అత్యవసర పరిస్థితుల్లో ఎల్బీనగర్లోని నాసా హాస్పిటల్ కి వచ్చాడు. వెంటనే డాక్టర్ల బృందం పరీక్షించి చూడగా గుండె నుంచి కాలులోకి రక్తాన్ని సరఫరా చేసే అయోర్టా దమని నుంచి కుడి కాలు లోకి రక్తం సరఫరా ఆగిపోయిందని గుర్తించారు. ఆ వెంటనే పిక్క మొత్తం ఫేషియటమే చికిత్స ద్వారా మోకాలు నుంచి పిక్కకింది వరకు మజిల్ను ( కండరాన్ని) ఓపెన్ చేసి ఎంబోలెక్టమి ద్వారా రక్తనాళాల్లోని గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించారు. వేస్కులర్ సర్జన్ నేతృత్వంలో సిటీ యాంజియో చేసి రక్త సరఫరానుపునరుద్ధరించామని తెలిపారు. ఆ తరువాత దెబ్బతిన్న కండరాన్ని తొలగించి తొడ భాగం నుంచి చర్మాన్ని తీసుకొని ప్లాస్టిక్ సర్జన్ ఆధ్వర్యంలో ఫ్లాప్ వేసి వ్యాక్యూమ్ అమర్చి స్కిన్ గ్రాఫ్టింగ్ చేశారు. 40 రోజుల తర్వాత తిరుపతి ఇప్పుడు ఆయన కాళ్ళ మీద ఆయన నడవగలిగే స్థితిలో ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. యువకుడికి గతంలో మెదడులో రక్తం గడ్డ కట్టిందని, ఆ తర్వాత కూడా రక్తంగట్టిపడకుండాఉండేందుకు, రక్తం పలుచన చేసేందుకు వాడే మందులు రెగ్యులర్గా వాడకపోవడంతో ఈ అరుదైన మజిల్ స్ట్రోక్ సమస్య వచ్చి ఉండవచ్చని డాక్టర్లు తెలిపారు. ఈ స్ట్రోక్ వచ్చిన వెంటనే అతను సరైన సమయంలో హాస్పిటల్ కి రావడంతో డాక్టర్ల బృందం సమిష్టిగా ఈ శస్త్ర చికిత్సలు విజయవంతంగానిర్వహించామని తెలిపారు. కాలయాపన చేసి ఉంటే అతని కాలు తీసేయాల్సి ఉండేదని, ఈ సందర్భంగా డాక్టర్లు విలేకరుల సమావేశంలో తెలిపారు.ఇది చాలా అరుదైన సంఘటనని ఒకే వ్యక్తికి 9 శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ల బృందానికి నాసా హాస్పిటల్ వ్యవస్థాపకులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రియాజ్ ఖాన్ అభినందనలు తెలిపారు. 40 రోజులపాటు నిపుణులైన డాక్టర్ల బృందం చికిత్స అందించి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండాచూడడంతోపాటు ఇవాళ ఆరోగ్యంగా డిశ్చార్జి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవుతున్న తిరుపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లకు రుణపడి ఉంటానని, 40 రోజులపాటు పట్టుదలతో డాక్టర్లకు అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చారని, ఎట్టకేలకు నేను నా కాలపై నిలబడ గలుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *