వాట్సాప్ గవరెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా

రాష్ట్ర ప్రభుత్వం ” మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం ” ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, వాట్సాప్ గవరెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వాట్సాప్ గవరెన్స్ సేవలపై రూపొందించిన క్యూ ఆర్ కోడ్ సేవలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ” మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం ” ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 ప్రభుత్వ సేవలు మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలు సాంకేతికంగా, సురక్షితంగా ఉంటాయని, ప్రజల గోప్యత పట్ల అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు, రెండో విడతలో 360 రకాల సేవలను వాట్సాప్‌లోనే అందుబాటులోకి తీసుకువస్తాయని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో వాట్సాప్‌ పాలనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వాట్సాప్‌ ద్వారా వివిధ సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఇందుకోసం 9552300009 మొబైల్ నంబర్‌ను వాట్సాప్ ద్వారా వినియోగించుకోవచ్చని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిపిఓ వెంకట నాయుడు, డిఆర్డిఏ పిడి నారాయణ, మెప్మా పిడి శ్రీహరి, సిపిఓ వెంకటేశ్వర రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *