మే 19వ తేదీ సోమవారం “శ్రీగిరి గిరి ప్రదక్షిణ” -పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలి- శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ విజ్ఞప్తి.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి శ్రీగిరి గిరి ప్రదక్షిణ ఈ మే నెల 19వ తేదీ, సోమవారం, ఉదయం 5 గంటలకు ఒంగోలు లోని శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గోశాల వద్ద నుండి వందలాది మంది భక్తులతో… సామూహిక గోవింద నామస్మరణతో… మంగళ వాయిద్యాలు నడుమ ప్రారంభమగునని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం అని పేర్కొంటూ… వైశాఖ మాసంలో శ్రీ స్వామివారి దర్శనం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందని, వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారని, వైశాఖ మాసంలో సముద్ర మరియు పుణ్య నది స్నానాలతో పాటు శ్రీవారిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదం అని పేర్కొన్నారు. కావున ఒంగోలు, పరిసర ప్రాంత హిందూ బంధు జనావళి అందరూ శ్రీగిరి గిరి ప్రదక్షిణ లో పాల్గొని, శ్రీ స్వామి వారిని దర్శించి వారి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *